గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని కుప్ప గంజివాగులో నీరు కలుషితం కావడానికి కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే విడదల రజిని సూచించారు. గణపవరం నుంచి మానుకొండ వారిపాలెం, వేలూరు, కుక్కపల్లి వారిపాలెం గ్రామాల పరిధిలో కుప్పగంజి వాగు ప్రవహిస్తోంది. వాగులో నీరు కలుషితం వల్ల చేపలు, కప్పలు చనిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె.. అక్కడికే అధికారులను పిలిపించి మాట్లాడారు. వాగులోని నీటి నమూనాలు పరీక్షిస్తామని... ఫలితాల అనంతరం పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.
ప్రతి పంట కొనుగోలు చేస్తాం..
తమ ప్రభుత్వం అన్నదాతకు ఏ కష్టం రాకుండా చూసుకుంటోందని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు రైతు భరోసా కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతుల నుంచి పంటను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు.
ఇదీచూడండి: తిరుపతి బైపోల్: భాజపా సరికొత్త వ్యూహం.. క్షేత్రస్థాయిలోకి వెళ్లటమే లక్ష్యం!