'వనం మనం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విడదల రజిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. వృక్షాలను పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. మొక్కల ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో అందరం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వనం-మనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అడవులు కొట్టివేయడం, రహదారులు అభివృద్ధి చేయడం తదితర కారణాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మాత్రమే పచ్చదనం ఉందని... 50 శాతం వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి :