రుణాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే రజనీకి విశాఖ వాసి ఫోన్ చేశారు. సీఎం స్వయంగా ఫోన్ చేసి మీతో మాట్లాడమన్నారంటూ ఫోన్ చేసిన జగజ్జీవన్ రామ్ చెప్పారు. అనుమానం వచ్చి ఎమ్మెల్యే రజనీ... జగజ్జీవన్ పేరుతో సీఎంవోలో ఎవరు ఉన్నారంటూ వాకబు చేశారు. జగజ్జీవన్‌తో ఫోన్లో మాట్లాడుతూనే డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ సిగ్నల్స్ ఆధారంగా జగజ్జీవన్‌ను పోలీసులు పట్టుకున్నారు. రాయచోటి ఎమ్మెల్సీ జకియాకు కూడా ఇలాగే ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. పట్టాభిపురం పీఎస్‌లో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పందించారు. విచారణ చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 'రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి'