ETV Bharat / state

వ్యాక్సినేషన్​ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్​ - guntur west mla latest news

గుంటూరులో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావాటి మనోహర్ నాయుడు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కొవిడ్​ వ్యాక్సినేషన్​ కేంద్రాలను వారిద్దరూ పరిశీలించారు.

vaccination center
వ్యాక్సినేషన్​​ కేంద్రం
author img

By

Published : May 13, 2021, 5:04 PM IST

గుంటూరులో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా, ప్రశాంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. మేయర్​ కావాటి మనోహర్ నాయుడుతో కలిసి నగరంలోని వ్యాక్సినేషన్​ కేంద్రాలను పరిశీలించారు. టీకా కేంద్రాల వద్ద సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కేంద్రం వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్​ కోరారు. రాష్ట్రానికి త్వరగా టీకాలు పంపించాలన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు మేయర్ కావాటి మనోహర్ నాయుడు తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని తెదేపా నేతలు ఆరోపించటం సరికాదన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజుపైన కేసులు పెట్టే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగా పెట్టే కేసులు నిలబడవని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.