తాను వ్యక్తిగత పనుల కోసమే దిల్లీ వచ్చానని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. తన మిత్రుడైన గరికపాటి మోహనరావును పరామర్శించేందుకే వచ్చానన్న అనగాని... పార్టీ మారానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాను కలవలేదని తేల్చిచెప్పారు. కలిసినట్లు ఆరోపిస్తున్నవారు నిరూపిస్తే... రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
ఇదీ చదవండీ...