ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి కొత్తూరులో అధికార పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు నడిచింది. ఓ వర్గానికి చెందిన నాయకులు భారీగా డీజే సౌండ్లతో వినాయకుని ఊరేగింపు చేస్తున్నారంటూ మరో వర్గం నేతలు శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజేలతో వినాయకుడ్ని తీసుకెళ్తున్న నేతలను పోలీసులు స్టేషన్కు తరలించారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు వినాయకుడి విగ్రహంతో సహా తెల్లవారు జాము వరకు పోలీస్టేషన్ ముందు బైఠాయించారు. తాము నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని చెప్పినా పోలీసులు వినలేదని ఆక్షేపించారు. ఆదివారం ఉదయం వరకు ఆందోళన కొనసాగడంతో పోలీసులు వెనుకడుగు వేశారు. ధర్నా చేస్తున్న వారికి సర్ది చెప్పి పంపించేశారు. నేతల ఆధిపత్య ధోరణితో నిమజ్జనం కావాల్సిన వినాయకుడు పోలీస్ స్టేషన్ ముందు తెల్లావార్లు వేచియున్నాడు.
ఇదీ చూడండి