గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ సత్యనారాయణ (14) అనే బాలుడు.. గతేడాది తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కొన్నాళ్లుగా మానసికంగా కుంగిపోయాడు. ఇదే క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన బాలుడి తల్లి, సోదరుడు.. బంధువుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి తెనాలి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: