ETV Bharat / state

Ministers Committee on Employees: పాత పింఛను అమలుకు ప్రభుత్వం అనాసక్తి.. గ్యారెంటీ పెన్షన్‌కు మెరుగులు - కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్

Ministers Committee Meeting With Govt Employees Unions: పాత పింఛన్‌ విధానం అమలుపై ప్రభుత్వం మరోసారి అనాసక్తిని చాటుకుంది. గ్యారెంటీ పెన్షన్‌కు మెరుగులు దిద్ది అమలు చేస్తామని.. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టం చేసింది. D.A, P.R.C బకాయిలను 2027 వరకు వాయిదాల్లో చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పింది.

Ministers Committee Meeting
Ministers Committee Meeting
author img

By

Published : Jun 6, 2023, 12:10 PM IST

Ministers Committee Meeting With Govt Employees Unions: మంత్రుల కమిటీ.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల్లో.. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్​(C.P.S) రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్​-G.P.S అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. CPS ఉద్యోగులకు 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఉండేలా G.P.Sలో కొన్ని మార్పులు ఉంటాయని.. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

ద్రవ్యోల్బణాన్ని అనుసరించి మార్పు చేసేలా ఆలోచిస్తున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. C.P.S రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారని.. P.RC. బకాయిలను నాలుగు సంవత్సరాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందని ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తు చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు కలిపి 7 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండగా.. వాటిని 2027 వరకు చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనల వల్ల చాలా మంది అర్హత కోల్పోతున్నారని మంత్రుల కమిటీకి వివరించారు. పీఆర్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను నియమిస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించగా.. ఉద్యోగ సంఘాల నాయకులు అందుకు తిరస్కరించారు. ఆయన సీఎస్‌గా ఉన్నప్పుడే 11వ పీఆర్సీలో అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించాలని కొందరు ఉద్యోగులు ప్రతిపాదించారు.

సీపీఎస్​ ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్‌ ఇచ్చేలా-G.P.Sకు తుది మెరుగులు దిద్దుతున్నామని.. సమావేశం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2014 జూన్‌ 2 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నవారిని క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62సంవత్సరాలకు పెంచడంపై కోర్టులో కేసులున్నాయని.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గత పీఆర్సీలో స్పెషల్‌-పే ఇచ్చేందుకు అనుమతించామని తెలిపారు. కొత్త జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్​ఆర్​ఏ అమలు చేస్తామని వివరించారు. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం నాలుగు వాయిదాల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. వైద్య విధాన పరిషత్తు సిబ్బందికి “010” కింద జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కేబినెట్‌లో పెట్టిన తర్వాత ఆయా విభాగాలు ఉత్తర్వులు ఇస్తాయన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కొంతమేర ఆలస్యం జరిగిందని మంత్రి బొత్స తెలిపారు.

"కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్‌ ఇచ్చేలా జీపీఎస్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నాం. కేబినెట్‌లో చర్చించాక ప్రకటిస్తాం. 2014 జూన్‌ 2నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. జనవరిలోపే ఉత్తర్వులు ఇస్తాం. 12వ పీఆర్సీ ఏర్పాటును కేబినెట్‌లో పెట్టి, ఛైర్మన్‌ను నియమిస్తాం. సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడంపై కోర్టులో కేసులున్నాయి. వాటిని పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాం" -మంత్రి బొత్స సత్యనారాయణ

C.P.S ఉద్యోగులకు G.P.Sలో రాయితీలు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పిందని.. కానీ పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతున్నట్లు ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఏపీ ఐకాస ఇచ్చిన 71 డిమాండ్లలో చాలా వరకు పరిష్కారమయ్యాయని అన్నారు.

చర్చల్లో సానుకూలత రావడంతో అదే వాతావరణంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తామని.. ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 8న గుంటూరులో ప్రాంతీయ సదస్సు యథావిధిగా ఉంటుందని.. ఆ రోజున అన్ని జిల్లాల ఛైర్మన్లతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

E.H.S అమలు కాకపోవడానికి ఆస్పత్రుల బిల్లుల్లో జాప్యమే కారణమని.. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగుల వాటాతో కలిపి ప్రభుత్వ వాటాను ఏ నెలకు ఆ నెల ట్రస్టు ఖాతాలోకి మళ్లిస్తే.. ఆస్పత్రులకు చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవన్నారు. దీన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని మంత్రులు చెప్పారన్నారు.

రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది C.P.S ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించిందని.. ఉపాధ్యాయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. G.P.S అమలుకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కొత్త పీఆర్సీ కమిటీని చట్టబద్ధతతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.