ETV Bharat / state

'చదువంటే నాకిష్టం'తో పాఠశాల్లో గ్రంథాలయాల అభివృద్ధి: మంత్రి సురేశ్​ - మంత్రి ఆదిమూలపు సురేశ్ గుంటూరు పర్యటన

ఒకటో దశలో చేపట్టిన నాడు-నేడు పనులు వచ్చే జనవరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'చదువంటే నాకిష్టం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన...నాడు-నేడు రెండో దశ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు.

'ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం'

author img

By

Published : Nov 26, 2020, 6:02 PM IST

నాడు-నేడు రెండో దశ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఒకటో దశలో చేపట్టిన నాడు-నేడు పనులు వచ్చే జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'చదువంటే నాకిష్టం' అనే కార్యక్రమాన్ని మంత్రి సుచరితతో కలిసి ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. పిల్లల్లో పఠనాశక్తిని పెంచటం, గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంగా 'చదువంటే నాకిష్టం' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి పాఠశాలలోనూ గ్రంథాలయం, ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ రీండిగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో బుక్ రీడింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ కోసం డైట్​లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.., టంగుటూరి ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయాన్ని టీచర్స్ ట్రైనింగ్ విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజీలేదన్న మంత్రి...కరోనాపై సెంట్రల్ కంట్రోల్ రూం ద్వారా రోజు సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీచదవండి

నిరంకుశ పోకడలను అడ్డుకున్నప్పుడే రాజ్యాంగానికి ఔన్నత్యం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.