వచ్చే జనవరి నుంచి కరోనా రెండో దశ వస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో డీఆర్సీ సమావేశం నిర్వహించగా.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరై జిల్లాలో సమస్యలపై చర్చించారు. నివర్ తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని.. తుపాను నష్టంతో పంట లెక్కింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. వరదలతో దెబ్బతిన్న కాలువల మరమ్మతు పనులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు.
ఈ నెల 25న ఇళ్లస్థలాల పంపిణీకి సమాయత్తమవుతున్నామని...ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశామని రంగనాథరాజు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులనూ పరిశీలిస్తామన్నారు. గుంటూరులో అసంపూర్తి రహదారులు, యూజీడీ పనులను మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లామని... సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిలాల్లో ప్రస్తుతం 10 ఇసుక రీచులున్నాయని.... సోమవారం నుంచి మరో 21 రీచ్లు అందుబాటులోకి రానున్నాయని శ్రీరంగనాథరాజు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'