గుంటూరు జిల్లా రేపల్లెలోని ఎ.బి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సందర్శించారు. వ్యాపారులకు మాస్కులు అందజేశారు. సరకులు, పండ్లు కొనే ప్రతి ఒక్కరూ దూరం పాటించాలని సూచించారు. వేరే రాష్ట్రాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మౌంట్ ఫోర్ట్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను ఆయన పరిశీలించారు.
మాస్కులు పంపిణీ చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ - గుంటూరు జిల్లాలో మాస్కులు పంపిణీ చేసిన మంత్రి
కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్భంధం పాటించి సహకరించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఉచిత నిత్యావసర సరుకులు, నగదును అందించేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు.
మాస్కులు పంపిణీ చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ
గుంటూరు జిల్లా రేపల్లెలోని ఎ.బి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సందర్శించారు. వ్యాపారులకు మాస్కులు అందజేశారు. సరకులు, పండ్లు కొనే ప్రతి ఒక్కరూ దూరం పాటించాలని సూచించారు. వేరే రాష్ట్రాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మౌంట్ ఫోర్ట్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను ఆయన పరిశీలించారు.
ఇదీ చూడండి: 'స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి.. చికిత్స అందిస్తాం'