వ్యవసాయ, దాని అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలు, ఆక్వా రంగం ఉత్పత్తులకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ నిత్యం సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులకు మధ్య వివాదం నెలకొందని, రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
గిట్టుబాటు ధరలపై సముద్ర, మత్స్య ఎగుమతుల సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ సంప్రదింపులు జరిపారని మోపిదేవి వివరించారు. ఎగుమతులపై ఇప్పుడిప్పుడే చైనా కొన్ని సడలింపులు ఇస్తుందని... 2వేల 8వందల 30 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు 4 రోజుల్లో ఎగుమతి చేశామని వెల్లడించారు. రైతుల్లో అభద్రతా భావం వద్దని భరోసా ఇచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కారణంగానే నిత్యావసరాల కొనుగోలు సమయం తగ్గించామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితే... సడలింపు ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... దీపాలు వెలిగించి సమైక్యతను చాటాలి: సీఎం జగన్