రైతులకు అవసరమై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రైతుభరోసా అమలుపై గుంటూరు జిల్లా అధికారులతో మోపిదేవి సమీక్ష చేశారు. పంట విక్రయించుకునే రైతులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. గూంటూరు జిల్లాలో రైతుభరోసా ద్వారా 4.52 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని.. సాయంత్రంలోగా రూ.250 కోట్లు రైతుల ఖాతాల్లో పడతాయని మోపిదేవి వెల్లడించారు.
ఇదీ చదవండి: రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్