Minister Mekapati on sand smuggling: సచివాలయాల పనితీరు, అర్జీల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రతి వారం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నివేదికలు తయారుచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా చేజర్లలో సోమవారం రోజు నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అంశాలను స్వయంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. రెవెన్యూ సమస్యలపై జేసీతో చర్చించి మార్గదర్శకాలను జారీ చేయిస్తామన్నారు.
పెన్నా పరివాహక ప్రాంతమైనా పెరమళ్లపాడు, కోటితీర్థం వద్ద ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరతపై వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించామని, అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీవో చెత్రవర్షిణి, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి, ఎంపీటీసీ సభ్యుడు, వైకాపా కన్వీనరు టి.విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటశేషయ్య, తహసీల్దారు శ్యామసుందరరాజు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
CM Jagan meets Gadkari: దిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్... అమిత్ షాతో సైతం భేటీకి అవకాశం..