ETV Bharat / state

దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం: మంత్రి చెరుకువాడ - jagananna colonies news

వినుకొండ మున్సిపాలిటీ ఎంకుపాలెంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలోనే ఓ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను చేపడుతోందని మంత్రి అన్నారు.

minister cherakuvada
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం
author img

By

Published : Jun 9, 2021, 4:56 PM IST

నవరత్నాల్లో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఎంకుపాలెం గ్రామంలోని 108 ఎకరాల్లో నిర్మించబోతున్న ఇళ్లకు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదలకు ఇళ్లను నిర్మిస్తుందని మంత్రి అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కొలమానంగా పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.

జగనన్న కాలనీలన్నింటినీ అన్ని సదుపాయాలతో సుందరంగా నిర్మించబోతున్నట్లు మంత్రి చెరుకువాడ పేర్కొన్నారు. ఇంటి పట్టా లభించిన వారంతా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Fine: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు జరిమానా

'ప్రాణాలు పోతున్నా.. మడమ తిప్పని రైతన్నలు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.