గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు లాక్డౌన్ వల్ల ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేకపోవడం వల్ల పస్తులుంటున్నామని కార్మికులు తెలిపారు. పళ్లెం, గరిటలతో ఎర్రబాలెం రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వచ్చి సోమవారం రాత్రి లేదా మంగళవారం విజయనగరం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు.
ఎర్రబాలెం రహదారిపై వలస కార్మికుల ఆందోళన - Migrant workers' agitation on guntoor district
తమను స్వస్థలాలకు పంపించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి దొరకడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రబాలెం రహదారిపై వలస కార్మికుల ఆందోళన
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు లాక్డౌన్ వల్ల ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేకపోవడం వల్ల పస్తులుంటున్నామని కార్మికులు తెలిపారు. పళ్లెం, గరిటలతో ఎర్రబాలెం రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వచ్చి సోమవారం రాత్రి లేదా మంగళవారం విజయనగరం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు