ETV Bharat / state

ఆ పాదాలకు.. అలుపుండదా.... - వలస కార్మికుల సమస్యలు న్యూస్

ఉన్న ఊరు పనిలేదు పొమ్మంటోంది... సొంతూరు రా రమ్మంటోంది... అందుకే... పదులు, వందలు, వేల కిలోమీటర్లు ఇలా దూరం ఎందాకైనా కాళ్లే చక్రాలుగా మార్చుకుని వలస కూలీలు కదిలి వెళ్తున్నారు. మరి వలస జీవుల్లో ఆ సత్తువ ఎక్కడిది.. అంత దూరం నడిచి వెళ్లాలనే ఆత్రం ఎందుకు? మండుటెండలో సైతం ముందుకు సాగుతున్న బాటసారులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రావా? వైద్యుల అభిప్రాయలతో ఈటీవి భారత్ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

migrant labourers walking in andhrapradesh

author img

By

Published : May 17, 2020, 5:30 AM IST

ఏపీ, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్... ఇలా రాష్ట్రం ఏదైనా సరే... రహదారుల వెంట నడుస్తున్న వలస కార్మికులు... రైలు పట్టాల వెంట పిల్లాపాపలతో సాగిపోతున్న కూలీలే కనిపిస్తున్నారు. నడవటం గొప్పా అనిపించొచ్చు. రోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పినా చాలామందికి చెవికెక్కదు. కొంతమంది కొద్దిరోజులు చేస్తారు. మరికొన్ని రోజులు ఆపేస్తారు. అయితే ఎవరూ నడిచినా నాలుగైదు కిలోమీటర్లకు మించదు. కానీ ఇపుడు వలస కార్మికులు మాత్రం వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. కాలి నడకన సాగుతున్న వారంతా నెత్తిన బ్యాగులు పెట్టుకుని వెళ్తున్నారు. మరికొందరు పిల్లల్ని బుజాలపై ఎక్కించుకుంటున్నారు. కాలికి సరైన చెప్పులుండవు. అయినా అలుపెరగని బాటసారుల పయనం సాగుతోంది. అసలు అంత దూరం ఎలా నడవగలుగుతున్నారు. వారి శరీరం ఏమైనా ప్రత్యేకమా... వారి మనోనిబ్బరం ఏంటి?

  • శారీరక సామర్థ్యం

వలస కూలీలంతా శారీరక శ్రమకు అలవడిన వారే.

స్వేదాన్ని పెట్టుబడిగా, రక్తాన్ని ముడిసరుకుగా మార్చి దేశ నిర్మాణంలో భాగమయ్యారు.

పరిశ్రమల్లో, నిర్మాణ పనుల వద్ద నిరంతరం కష్టించి పని చేస్తుంటారు.

అందుకే వారి కండరాలు ఎపుడూ చైతన్యంగా ఉంటాయి.

శరీరంలో చెడు కొవ్వు వంటిది ఉండదు.

బీపీ, షుగర్ వంటి జబ్బులు దరిచేరవు.

శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టే సులువుగా నడవగలుగుతున్నారు.

  • మానసిక స్థైర్యం

వీరందరూ మానసికంగా చాలా దృఢంగా ఉంటారు.

తప్పనిసరి పరిస్థితులే వీరిలో మానసిక ధృడత్వాన్ని పెంచుతాయి.

రేపటి గురించి ఆలోచించరు.

సొంతూరికి చేరుకోవాలనే గమ్యం మాత్రమే కనిపిస్తుంది

ఎలాగోలా బతకటం అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు.

ఆహారం ఏది దొరికితే అది, ఎంత ఉంటే అంతే తింటారు.

  • సమస్యలు ఉండవా

రోజుకు 50 నుంచి 100 కిలోమీటర్ల మేర నడక..

కాళ్ల నొప్పులు వంటి సమస్యలు తప్పవు.

కాళ్లకు బొబ్బలు వస్తాయి. అవి పగిలితే పుండ్లు పడే ప్రమాదం.

అరికాళ్లు పగుళ్లు వస్తాయి. పగుళ్లు పెరిగితే నడవానికి ఇబ్బందులు తప్పవు.

వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు ఎక్కువ సమస్యలు.

వృద్ధులకు కాల్షియం లోపం, ఎముకల అరుగుదల

మహిళలు, పిల్లలకు కాల్షియంతో పాటు రక్తహీనత వంటి సమస్యలు.

ఇలాంటివారు ఎక్కువ దూరం నడవటానికి ఇబ్బంది.

వేసవి కాబట్టి మంచినీరు పెద్ద సమస్య.

శరీరానికి సరిపడా నీరు లేకపోతే డీ హైడ్రేషన్ వస్తుంది.

ఇదీ చదవండి: ఆరుబయటే తిండి.. చేతిలో డబ్బులు ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.