తమకు వేతనాలు చెల్లించి.. స్వగ్రామాలకు పంపించాలని గుంటూరు జిల్లా వెదుళ్లపల్లిలో వలస కూలీలు నిరసన చేశారు. జాతీయ రహదారి 216 పనుల నిమిత్తం బీఎస్సీపీఎల్ ప్రైవేట్ సంస్థలో.. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల కార్మికులు పని చేశారు. తమకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని... భోజనం సరిగా పెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు.
లాక్డౌన్ నేపథ్యంలోనూ తమను పని చేయాల్సిందిగా యజామాన్యం ఒత్తిడి తీసుకొస్తోందని వాపోయారు. ఆగ్రహించిన వలస కార్మికులు... బాపట్ల మండలం వెదుళ్లపల్లి బధిరుల పాఠశాల వద్ద రహదారిపై బైఠాయించారు. జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. స్వగ్రామాలకు వెంటనే పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ధర్నాకు దిగారు. గ్రామీణ పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు.
ఇదీ చూడండి: