ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన వారు లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ తినేందుకు తిండిలేక చేసేందుకు పనిలేక కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం నెల్లూరు వెళ్లిన కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. అలా కాలినడకన గుంటూరు చేరిన వీరిని నల్లపాడులో పోలీసులు అడ్డుకుని.. క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. దీనిపై కూలీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమను స్వస్థలాలకు పంపించాలని కోరారు.
ఇదీ చదవండి..