మధ్యతరగతి గృహ నిర్మాణాల అవసరాల కోసం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రభుత్వం కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు. నవులూరులోని సుమారు 34 ఎకరాలలో ఎమ్ఐజీ ప్లాట్లను కేటాయించారు. వీటికి సంబంధించిన నిర్మాణ పనులకు.. ఈనెల 11న ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని భూములను కేటాయించనున్నారని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. సంవత్సరానికి రూ.18 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తులెవరైనా.. ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఆర్డీఏ కమిషనర్ విజయ తెలిపారు.
ఇదీ చదవండి:
Gas Leakage In Chemical Factory: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్...ఒకరు మృతి