గుంటూరు జిల్లాలో వైద్య పరికరాల వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన పుల్లా సాహెబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పిడుగురాళ్లలో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్తెనపల్లి మండలం చాగంటివారిపాలెం వాసి పుల్లా సాహెబ్ వైద్య పరికరాలు వ్యాపారం చేసేవాడు. దాని కోసం స్థానికుల నుంచి రూ.12 కోట్ల మేర వసూలు చేశారు. 10 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. పుల్లా సాహెబ్‌పై స్థానిక వ్యాపారి సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుల్లా సాహెబ్ తన వద్ద 7 కోట్ల మేర తీసుకున్నట్లు ఆరోపించారు. అదే సమయంలో మరికొందరు స్థానికులు కూడా డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
పుల్లా సాహెబ్ గత పది రోజులుగా బెంగళూరు, చైన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు పిడుగురాళ్లలో పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న డబ్బులు రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి వద్ద ఎంత తీసుకున్నదీ లెక్కలు తీస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు