ETV Bharat / state

Pedakakani Temple: పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్ లైసెన్స్​ రద్దు​ - గుంటూరు జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్

Pedakakani malleswara swamy temple: పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. అన్నదానానికి భోజనం సరఫరా చేసే క్యాంటీన్‌లో కోడి మాంసం వండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దేవాదాయ శాఖ అధికారులు క్యాంటీన్​ను సీజ్​ చేసి... లైసెన్స్​ రద్దు చేశారు.

Pedakakani malleswara swamy temple
పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం
author img

By

Published : Apr 8, 2022, 7:38 AM IST

Updated : Apr 8, 2022, 4:08 PM IST

పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం

Pedakakani malleswara swamy temple: గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు.. క్యాంటీన్​ను సీజ్​ చేశారు. ఈనెల 1న క్యాంటీన్ నిర్వహణ నిర్వాహకుడు లైసెన్సు పొందినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌ తీసుకున్న వారం రోజుల్లోనే నిబంధనల ఉల్లంఘించడం తీవ్ర విమర్శలకు తావించ్చింది. క్యాంటీన్ నిర్వహణ లైసెన్స్ రద్దుచేస్తూ దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ డిపాజిట్‌ను జరిమానా కింద జమ చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

ఆలయ ఈవో కార్యాలయం వద్ద స్థానికుల ధర్నా

"బండి మాత్రం లోపలికి వచ్చిందని తెలిసింది. అక్కడ వాళ్లను అడిగితే బయట తయారు చేయించాము. వెజిటేరియన్​ క్యాంటీన్​లో తయారు చేయించాం. ఈ రెండూ ముందు నాన్​వెజ్​ బండిలోకి ఎక్కించాము. తర్వాత వెజ్​ తీసుకెళ్లడానికి బండి లోపలికి వచ్చిందని చెప్పారు. బండి కూడా రావడం తప్పే. అందుకే అతడి లైసెన్స్​ రద్దు చేస్తున్నాం. ఇంతకు ముందు ఏమైనా ఇలాంటివి జరిగాయా అన్న విషయంపై ఆలా తీస్తున్నాం." -ఈమని చంద్రశేఖర్‌రెడ్డి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌

Pedakakani malleswara swamy temple: క్యాంటీన్‌ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలంపాటలో దక్కించుకున్నాడు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్‌ వ్యాపారం కూడా ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వారు నోరు మెదపడం లేదు. క్యాంటిన్‌ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్‌ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై విమర్శలు తీవ్రస్థాయిలో రావడంతో దేవాదాయ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆలయంలోని క్యాంటీన్​ను సీజ్​ చేశారు.

స్థానికుల ఆందోళన: ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండటంపై... హిందూ ధార్మిక సంఘాలు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఆలయ ఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆలయాన్ని అపవిత్రం చేసేలా మాంసాహారం వండటం దారుణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరచూ ఇలాంటివి జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కృష్ణాజిల్లాలో 9 మంది విద్యార్థినులకు అస్వస్థత

Last Updated : Apr 8, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.