ETV Bharat / state

'గుంటూరును క్లీన్​ సిటీగా మారుస్తాం' - మేయర్ కావటి శివనాగ మనోహర్ తాజా సమాచారం

గుంటూరును స్వచ్ఛ​ నగరంగా మారుస్తామని మేయర్ కావటి శివనాగ మనోహర్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలో ప్రయోగాత్మకంగా స్థానికులకు మూడు చెత్త బుట్టలను ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్​తో కలిసి పంపిణీ చేశారు. ఈ విధానం అమలుకు మురికివాడల్లో అయితే ఇంటికి రోజుకు రూ.రెండు, మిగతా చోట్ల రూ.4 చెల్లించాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు.

చెత్తబుట్టల పంపిణీ
చెత్తబుట్టల పంపిణీ
author img

By

Published : Jun 13, 2021, 12:43 PM IST

ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని క్లీన్ గుంటూరుగా మారుస్తామని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. పరిశుభ్రతను పరిరక్షించే లక్ష్యంతో గుంటూరు బ్రాడీపేటలో ప్రయోగాత్మకంగా స్థానికులకు మూడు చెత్త బుట్టలను ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్​తో కలిసి పంపిణీ చేశారు. రెండు బుట్టల్లో తడి, పొడి చెత్తను, మూడో బుట్టలో హానికరమైన వ్యర్థపదార్థాలను సేకరించనుండగా.... ఇంటికే వచ్చి పురపాలక సిబ్బంది వీటిని రోజూ సేకరిస్తారని తెలిపారు.

ఈ విధానం అమలుకు మురికివాడల్లో అయితే ఇంటికి రోజుకు రూ.రెండు, మిగతా చోట్ల రూ.4 చెల్లించాల్సి ఉంటుందని మేయర్ తెలిపారు. నగరంలో రెండు డివిజన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని.. భవిష్యత్తులో మిగతావార్డుల్లోనూ ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయటం మానుకోవాలని మేయర్ శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

కృత్రిమ కొరతతో... ఘాటెక్కిన మిర్చి విత్తన ధరలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.