మరుప్రోలువారిపాలెంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముగ్గురు వాలంటీర్లతోపాటు ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది నిందితులను అరెస్టు చేసి రిమాండు పంపించామన్నారు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు. మరో నిందితుడైన మైనర్‌కు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మరుప్రోలువారిపాలెంలో దాడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి గ్రామానికి చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి 14 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడరాదన్నారు. నిష్పక్షపాతం కేసు దర్యాప్తు చేశామని చెప్పారు. బయట వ్యక్తులు వచ్చి గ్రామంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ సంయమనం పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,846 కరోనా కేసులు, 69 మరణాలు