ETV Bharat / state

ఆరేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన మణిపాల్ వైద్యులు

author img

By

Published : Feb 4, 2021, 9:30 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలానికి చెందిన ఆరేళ్ల చిన్నారికి మణిపాల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా వ్యాధితో బాధపడుతున్న పాపకు ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా చికిత్స అందించామని ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ సుధాకర్ చెప్పారు. లేకుంటే కనీసం రూ. 15లక్షలు ఖర్చయ్యేదని తెలిపారు. ఈ తరహా చికిత్స చేయడం ఏపీలోనే తొలిసారి అని పేర్కొన్నారు.

manipal-doctors-perform-a-rare-surgery-on-a-six-year-old-girl-in-gunturu-district
ఆరేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన మణిపాల్ వైద్యులు

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సిరి స్పందనకు మణిపాల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చిన్నారి.. ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

మూల కణ మార్పిడి చికిత్స ద్వారా నయమవుతోందని గుర్తించిన వైద్యులు.. గతేడాది డిసెంబరులో శస్త్రచికిత్సను ప్రారంభించారు. దీనితో పాటు సాల్వెజ్ కీమో థెరపీ చేయడంతో ప్రస్తుతం.. పాప కోలుకుందని వైద్యులు చెప్పారు.

ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా పాపకు చికిత్స అందించామని ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. లేకుంటే కనీసం రూ. 15లక్షలు ఖర్చయ్యేదని తెలిపారు. ఈ తరహా చికిత్స చేయడం రాష్ట్రంలోనే తొలిసారి అని చెప్పారు. చిన్నారికి సోకిన అరుదైన క్యాన్సర్​కు చికిత్స అందించడం వైద్యులకు సవాలుగా మారిందని అన్నారు. పాపను బతికించాలనే పట్టుదలతో చికిత్స చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'వాలంటీర్​ని నేనే చెప్తున్నా... ఈసారి ఇటెయ్యండి..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.