ETV Bharat / state

ఎన్నో ఏళ్ల వేదనకు ఇప్పుడు విముక్తి: మంగాయమ్మ భర్త - happy

73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భధారణ ప్రక్రియతో కవల పిల్లలకు జన్మనిచ్చింది మంగాయమ్మ. లేటు వయసులో తల్లి కావటం ద్వారా మంగాయమ్మ రికార్డు సృష్టించింది. ఇదంతా ఆధునిక వైద్య పరిజ్ఞానం గొప్పదనమని వైద్యులు చెబుతుంటే.... ఇది వైద్యుల ఘనతగానే మంగాయమ్మ దంపతులు కొనియాడుతున్నారు.

మంగాయమ్మ దంపతులు
author img

By

Published : Sep 5, 2019, 5:30 PM IST

మంగాయమ్మ భర్త రాజారావుతో ముఖాముఖి

పిల్లలు లేరంటూ సూటిపోటి మాటలు.... రోడ్డుపైకి వెళ్తే అందరూ తప్పుకుని వెళ్లటం.... శుభ కార్యాలకు పిలుపులు లేకపోవటం ఇవన్నీ మంగాయమ్మ దంపతుల్ని ఎంతగానో బాధించాయి. ఎలాగైనా సంతానాన్ని పొందాలన్న ఆలోచన ఆమెలో పెరిగింది. 73 ఏళ్ల వయసులోనూ ధైర్యం చేసింది. కృత్రిమ గర్భధారణను ఎంచుకుంది. చివరికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి... ఇన్నాళ్లూ పడిన ఆవేదనను దూరం చేసుకుంది. మంగాయమ్మ ఆరోగ్యం, ప్రసవం విషయంలో వైద్యులు చూపిన ఆప్యాయత.... శ్రద్ధ... ఎప్పటికీ మరువలేనని ఆమె భర్త రాజారావు చెప్పారు. పుట్టిన ఇద్దరూ అమ్మాయిలే అయినా తనకు ఎలాంటి బాధ లేదని... వారిలో ఒకరిని దేశ సేవకు... మరొకరిని ఆధ్యాత్మిక సేవకు పంపిస్తానని అన్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. పిల్లలు కలగాలని ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం రాలేదని.. గుంటూరుకు చెందిన వైద్యులు ఉమాశంకర్.. ఆధునిక వైద్యం సాయంతో తమ వేదన తీర్చారని చెప్పారు.

సంబంధిత కథనాలు

73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు

'కృత్రిమ గర్భధారణ కోసం మంగాయమ్మ వస్తే ఆశ్చర్యపోయా'

Intro:ఇసుకాసురులు నుండి ఇసుకను సామాన్యుడికి అతి తక్కువ ధరకే లభ్యమయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు మండలంలోని కాపవరం గ్రామం లో ఇసుక స్టాక్ పాయింట్ను ఆమె గురువారం ప్రారంభించారు ఇసుక లబ్ధిదారుడి ఇంటికి చేరేలా చేపట్టిన ఈ కార్యక్రమం ఎనలేనిది అన్నారు పూర్తిస్థాయిలో ఇసుకాసురులు ఆట కట్టించే రీతిలో ఈ విధానం కొనసాగుతుందన్నారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

Body:sand supply

Conclusion:సాండ్ సప్లై స్టాక్ పాయింట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.