మద్యం దుకాణాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు మంగళగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. మద్యం షాపులు మూసేయాలంటూ నినాదాలు చేశారు. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని విమర్శలు గుప్పించారు.
మద్యం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మద్యం పేరుతో ప్రజలపై మోపిన భారాన్ని ఎత్తేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. అనంతరం సీఐ ప్రమీలారాణికి వినతి పత్రం అందించారు.
ఇవీ చదవండి.. విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం: కన్నా