ఎమ్మార్పీఎస్ స్థాపించి 26 ఏళ్లు గడిచిందని... తాను బతికున్నంతకాలం అందులోనే కొనసాగుతానని మందకృష్ణ మాదిగ అన్నారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని.. ప్రజా సమస్యల కోసమే పలు పార్టీ నేతలను కలిసినట్లు స్పష్టం చేశారు. వెలగపూడిలో రెండు దళిత వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళా మృతి చెందడం అత్యంత బాధకరమన్నారు. మృతురాలి కుటుంబానికి అయన సంతాపం తెలిపారు.
దళితల పైన దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పైనా ఉందన్నారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త చొరవ తీసుకుని దాడులను అడ్డుకోవాలని సూచించారు. పోలీసులు అనుమతి ఇస్తే.. వెలగపూడి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదారుస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు.
ఇదీ చదవండి: