MRPS President Manda Krishna: దళిత యువతిపై అత్యాచారం చేసిన సాంబయ్యను.. వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులను అరెస్ట్ చేయకుండా ఉండేలా.. మంత్రి విడదల రజని మరిది పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇదే విషయంపై తాను కూడా ఫోన్లో మాట్లాడిన సందర్భాలున్నాయన్నారు.
దళిత మహిళలపై అత్యాచారం జరిగితే.. ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయకపోగా.. న్యాయం కోసం రోడ్డెక్కిన వారిని అరెస్ట్ చేసి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని ఖండించారు. తక్షణం నగరంపాలెం సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేయకుంటే వారం రోజుల పాటు మండల కేంద్రాల్లో.. నిరసనలు, అనంతరం డిసెంబర్ 4వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: