గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు షేక్ ఇమామ్ బాషాగా పోలీసులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన బాషా భయాందోళనకు గురై.. బాపట్ల మండలం జమ్ములపాలెం రోడ్డులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :