ETV Bharat / state

Accident: లారీ ఢీకొని బైక్ మెకానిక్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

author img

By

Published : Oct 25, 2021, 10:17 PM IST

అతను ఒక బైక్ మెకానిక్. పెట్రోలు కోసం బంక్​కు వెళుతున్నాడు. ఇంతలో లారీ రూపంలో మృత్యువు అతడిని వెంటాడింది.ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెం రోడ్డు వద్ద జరిగింది. మృతునికి 5 నెలల చిన్నారితో పాటు, మూడేళ్ల బాబు ఉన్నాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు.

man died in road accident at burripalem road in guntur
లారీ ఢీకొని బైక్ మెకానిక్ మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

గుంటూరు జిల్లా తెనాలి(tenali in guntur district)లో.. సాధిక్ అనే బైక్ మెకానిక్ రోడ్డు ప్రమాదం(road accident)లో మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు.. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

ఏం జరిగిందంటే..

పట్టణానికి చెందిన సాదిక్ అలీబేగ్(27) అనే వ్యక్తి బైక్ మెకానిక్​గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెట్రోల్ కోసం బుర్రిపాలెం రోడ్డు వద్ద గల బంకుకి వెళుతున్నాడు. అదే మార్గంలో అతివేగంగా వెళ్తున్న మినీ లారీ.. సాదిక్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాదిక్ ఒక్కసారిగా లారీ వెనుక చక్రాల కింద పడగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​కు చేరారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి అక్కడే బైఠాయించి నినాదాలు చేయటంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బి.కోటేశ్వరరావు.. బాధిత కుటుంబసభ్యులతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళన విరమించిన.. కుటంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెనుదిరిగారు.

ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్(mla annabathuni shivakumar) ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. సాదిక్ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

Minister Anil kumar: తెదేపా ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా: మంత్రి అనిల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.