ETV Bharat / state

పెళ్లిచూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చాడు - అసలు పని వదిలేసి - Son in Law Robbery at Aunt House

Son-in-Law Robbery at Aunt House in Manyam District: పెళ్లి చూపుల కోసమని మేనల్లుడు మేనత్త ఇంటికి వచ్చాడు. అమ్మాయి నచ్చిందో లేదోకానీ మనోడు వేరే పని కానిచ్చేశాడు. అసలు విషయం తెలిశాక బాధితులు లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ మనోడు చేసిన ఘనకార్యమేంటో తెలుసా!

son_in_law_robbery_at_aunt_house
son_in_law_robbery_at_aunt_house (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 8:32 PM IST

Updated : Sep 24, 2024, 9:28 PM IST

Son-in-Law Robbery at Aunt House in Manyam District: పెళ్లి చూపుల కోసమని వచ్చాడు. మేనత్త ఇంట్లో విడిది చేశాడు. పెళ్లి చూపుల తర్వాత మేనత్త ఇంట్లో రాత్రి బస చేశాడు. అంతేకదా అనుకుంటున్నారా.. రాత్రి బస చేసిన సమయంలో మేనత్త ఇంట్లోని బంగారపై కన్నేశాడు. అంతే ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ. 50 వేల నగదుతో పాటు, బంగారం మొత్తం దోచుకున్నాడు. ఆ తరువాత బంధువులకు కూడా చెప్పకుండా ఇంటి నుంచి పలాయనం చిత్తగించాడు.

బయట నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారు, మేనల్లుడు కనిపించకపోవటంతో ఖంగారు పడ్డారు. తీరా చూశాక, మేనల్లుడు వ్యవహరం బయటపడింది. ఈ దోపిడీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటం, నిందితుడు పట్టుబడటంతో వ్యవహారం వెలుగు చూసింది. తాజాగా వెలుగు చూసిన ఈ దోపిడీ పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదబొండపల్లిలో ఈ ఏడాది జులై 27వ తేదీన చోటు చేసుకుంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాణ మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం మండలం పెద బొండపల్లికి చెందిన మనమ్మ ఇంట్లో ఈ ఏడాది జులై 27వ తేదీన 16.5 తులాల బంగారం చోరీకి గురైందని తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తన మేనల్లుడు దేవబత్తుల లక్ష్మణరావు (34) ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆమె స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు దేవబత్తుల లక్ష్మణరావుని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిదింతుడి నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

పెళ్లిచూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చాడు - అసలు పని వదిలేసి (ETV Bharat)

పార్వతీపురం మండలం పెద బొండపల్లికి చెందిన మనమ్మ ఇంట్లో ఈ ఏడాది జులై 27వ తేదీన 16.5 తులాల బంగారం చోరీకి గురైంది. రాజమహేంద్రవరానికి చెందిన తన మేనల్లుడు దేవబత్తుల లక్ష్మణరావు ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆమె స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మనమ్మ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు దేవబత్తుల లక్ష్మణరావుని అరెస్టు చేసి నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది.- అంకిత సురాణ, ఏఎస్పీ

తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్​ చీఫ్​గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి - Sarva Sreshta Tripathi as SIT Chief

రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు - రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ - New Liquor Shops Notification

Last Updated : Sep 24, 2024, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.