గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ సూర్య శిల్పశాల నిర్వాహకులు.. కాటూరి వెంకటేశ్వరరావు వరల్డ్ రికార్డ్ కోసం 75వైల ఐరన్ నట్లతో.. 10అడుగుల ఎత్తుగల మహాత్మాగాంధీ విగ్రహాన్ని
తయారు చేసి పట్టణంలో ప్రదర్శనకు ఉంచారు. తెనాలి కళలకు పుట్టినిళ్లని.. విగ్రహ పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొనియాడారు. కాటూరి వెంకటేశ్వరరావు గతంలో కూడా అనేక ప్రఖ్యాత విగ్రహాలు తయారు చేశారని ప్రశంసించారు. కేవలం బోల్టులతోనే ఇంతటి భారీ విగ్రహం తయారు చేయటం అభినందనీయమన్నారు. వీరు తయారు చేసే విగ్రహాలకు అనేక అవార్డులు రావాలని.. తెనాలి పేరును దేశం నలుమూలల చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు..
గతంలో తాను తయారు చేసిన అనేక విగ్రహాలకు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిందని.. శిల్పి వెంకటేశ్వరరావు తెలిపారు. గాంధీ విగ్రహన్ని గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ వారికి పంపుతామని వివరించారు. తెనాలి కీర్తిని దేశం నలుమూలల వ్యాప్తింపజేస్తామని అన్నారు.
ఇదీ చదవండి:
Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు