Sringeri Kumbabishekam : కర్నాటక రాష్ట్రంలోని శృంగేరిలో గల శ్రీమలహానికరేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నూతనంగా మహారాజగోపురాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా.. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రతువులో మొదట శ్రీ స్తంభ గణపతి ఆలయంలో కుంభాభిషేక వేడుకను నిర్వహించారు. అనంతరం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీమలహానికరేశ్వరస్వామి ఆలయంలో వేద, మంత్రోచ్చరణల మద్య సహస్ర కలశాభిషేకంను శాస్త్రోక్తంగా చేపట్టారు. కన్నుల పండువగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని దేవతాముర్తులను దర్శించుకున్నారు.
ఉదయం తొమ్మిది గంటల తరువాత శ్రీమలహానికరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమలహానికరేశ్వరస్వామికి, శ్రీభవానీ అమ్మవారికి కూడా మహాకుంభాభిషేకము నిర్వహించారు. అంతే కాకుండా ఆలయంలోని విమానగోపురానికి, రాజగోపురాలకు కూడా కుంభాభిషేకం నిర్వహించారు. ఇది ముగిసిన అనంతరం మహాపూజ, మహానీరాజనము వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి చేతులమీదుగా ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా పదకొండు రోజుల పాటు ప్రధాన ఆలయం ప్రాంగణంలో హోమాలను నిర్వహించనున్నారు.
ఇవీ చదవడి :