ETV Bharat / state

పిచ్చికుక్కల దాడిలో ఎనిమిది మంది చిన్నారులకు గాయాలు - గుంటూరులో పిచ్చికుక్కలు దాడి తాజా వార్తలు

పిచ్చి కుక్కల దాడిలో 8 మంది చిన్నారులు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా శ్యామలా నగర్‌లో జరిగింది. ఈ నెలలో ఇది రెండో ఘటన. శునకాల స్వైరవిహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

mad dogs bite 8 childerns in Shyamala Nagar at guntur
8మంది చిన్నారులపై పిచ్చికుక్కలు దాడి..
author img

By

Published : Feb 7, 2020, 12:56 PM IST

చిన్నారులపై శునకాల దాడి

గుంటూరు జిల్లా శ్యామలానగర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శ్యామలానగర్ 2, 10వ లైన్లలో శునకాల దాడిలో 8 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన చిన్నారులను పట్టాభిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెలలో ఇది రెండవ ఘటన కావటంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమను కుక్కల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

నరసరావుపేటలో ఇద్దరు బాలికలు అదృశ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.