గుంటూరు జిల్లా మాచర్లలో ఆటో కోసం వేచి ఉన్న తల్లీబిడ్డను పోలీసులు తమ వాహనంలో ఇంటి వద్ద విడిచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. మాచర్లలో నివాసం ఉండే ఓ మహిళ కొద్దిరోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం ఆటోలో వచ్చిన వారు.... తిరిగి వెళ్లేటప్పుడు వాహనం దొరక్క ఇబ్బంది పడ్డారు. మాచర్లలోని నెహ్రూనగర్ చెక్‌పోస్ట్ వద్దకు వచ్చి ఆటో కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అప్పుడే రౌండ్స్‌కి వచ్చిన మాచర్ల రూరల్ ఎస్సై ఉదయలక్ష్మి... వారిని చూసి చలించిపోయారు. వెంటనే తన వాహనంలో వారిని ఇంటివద్ద వదిలిపెట్టమని కానిస్టేబుల్‌కు చెప్పారు. బాలింతను, ఆమె తల్లిని, బిడ్డను కానిస్టేబుల్ వారి ఇంటికి చేర్చారు.
ఇదీ చదవండి