ETV Bharat / state

పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికులు.. కానీ ఇంతలోనే.. - గుంటూరులో ప్రేమికుల ఆత్మహత్య వార్తలు

వారిద్దరు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, కులాలు వేరవటంతో.. ఇంట్లో వారు నిరాకరిస్తారని భావించి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

lovers commits suicide by hanging to a tree in guntur district
చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట
author img

By

Published : Jan 18, 2021, 3:01 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సత్తెనపల్లికి చెందిన యువతి, యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువకుడు తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. యువతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి కులాలు వేరు కావటంతో.. ఇంట్లో వారు పెళ్లికి నిరాకరిస్తారని భావించి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆదివారం సాయంత్రం వీరిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాల వారు.. పిల్లల గురించి వెతుకుతున్నారు. సత్తెనపల్లి మండలం వెంకటపతి కాలనీ పొలాల్లో చెట్టుకు.. ఒకే చున్నీతో ఉరివేసుకుని కనిపించారు. యువతి తల్లి అక్కడకు చేరుకున్న రోధిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు: రూ.10 లక్షలకు కిడ్నాప్‌ ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.