గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన శ్రీనివాసరావు ద్విచక్రవాహనంపై వస్తూ.. జాతీయ రహదారి దాటే క్రమంలో గుంటూరు నుంచి వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో జాప్యం.. వారం తర్వాత కూడా రాని ఫలితాలు