చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ రెడ్డికి మొదటి స్థానం దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో మృతి చెందిన తెదేపా కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. ఓటీఎస్ పేరుతో ఇల్లు ఇచ్చిన తర్వాత.. పింఛను కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని లోకేష్ ఆరోపించారు.
సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులే అభివృద్ధి చెందలేదంటే.. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఆయన నివాసానికి సమీపంలోనే విచ్చలవిడిగా మత్తుపదార్థాల విక్రయాలు జరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అతిథి అధ్యాపకులుగా మారారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలూ, అన్ని ప్రాంతాలలో ప్రజలతో కలిసి తిరిగానని.. ఆర్కే ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో పర్యటించారో చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మంగళగిరి అభివృద్ధికి 2,800 కోట్లు కేటాయించారని ఆ నిధులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: CM JAGAN REVIEW ON PRC: ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం..ఫిట్మెంట్ ఖరారు చేసే అవకాశం