వైకాపా ప్రభుత్వ తీరుపై నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జైలులో ఉన్న 19 మంది రైతులను ఆయన పరామర్శించారు. రైతులంతా అమరావతి కోసం పోరాడుతూ రోడ్డు దిగ్బంధం కేసులో జైలుకెళ్లారు. వైకాపా వాళ్లు చేసే ర్యాలీకి పోలీసులు బందోబస్తు ఇస్తున్నారని.. ఐకాస నేతలపై కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఉద్యోగ విరమణ చేసిన ఆర్మీ జవాన్ ను అరెస్టు చేయడం సరికాదన్నారు. 16 నెలలు జైళ్లో ఉన్న జగన్ కు ఆంధ్రులందరినీ జైళ్లోకి పంపడం కల అని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమే: పేర్ని నాని