విజయవాడలో హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. మూడోసారి సమావేశమై కమిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించింది. రైతులు చెప్పదలచుకున్న అంశాలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం వరకు రాతపూర్వకంగా ఇవ్వాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో పంపవచ్చని తెలిపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చన్నారు.
రాజధాని ప్రాంతంలో రాజకీయంగా ప్రేరేపించటంతో కొన్ని ధర్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. ఈ నెల 17న మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానున్నట్లు పేర్ని నాని తెలిపారు. అన్ని జిల్లాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే రైతులు మంత్రులను కలిశారని వెల్లడించారు.
ఇదీ చదవండి