ETV Bharat / state

ఒక్కసారిగా ఇళ్లు ఖాళీ చేయమన్నారని.. గుంటూరులో స్థానికుల ఆందోళన

author img

By

Published : Feb 16, 2023, 9:16 AM IST

Agitation in Guntur: గుంటూరులోని షాహిద్‌నగర్‌ వద్ద.. వాళ్లంతా దాదాపు 40 నుంచి 50 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఒక్కసారిగా తమ ఇళ్లను ఖాళీ చేయమని అధికారులు చెప్పడంతో.. వాళ్లంతా రోడ్డుపై బైఠాయించి.. ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చి చెప్పినా.. ప్రయోజనం లేకపోయింది.

గుంటూరులో స్థానికుల నిరసన
locals protest in guntur
గుంటూరులో ఆందోళన

Agitation in Guntur: గుంటూరులోని షాహిద్​నగర్ వద్ద తమ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంపై స్థానికులు నిరసనకు దిగారు. గుంటూరు-పొన్నూరు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలగా ఇక్కడ ఉంటున్నామని.. హఠాత్తుగా ఇళ్లు వదిలి ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేయడం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రెండిళ్లను కూల్చారని.. మిగతా ఇళ్లు ఖాళీ చేసేందుకు అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. ఈ ఆందోళన జరుగుతుండగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వారిని సముదాయించేందుకు ప్రయత్నించగా.. నిరసనకారులు మండిపడ్డారు. ఎమ్మెల్యేకు తెలియకుండా అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

"పక్కన డ్రైనేజీ ఉందని చెప్పి.. రెండిళ్లను తీశారు. ఆ ఇళ్లను తీసిన తరువాత.. అంతవరకే కదా అని ఊరుకున్నాం. నోటీసులు వచ్చాయి.. ఏంటిదీ అని ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. ఆయనేమో నాకు తెలియదు అంటున్నారు. ఒక్క విషయం చెప్పండి.. ఆయనకు తెలియకుండా నోటీసు ఎలా వచ్చింది". - స్థానికుడు

"వాలంటీరు వచ్చి.. మాకు నోటీసు ఇచ్చి వెళ్లారండీ.. నోటీసులు ఎందుకు ఇస్తారండీ అస్సలు. మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచీ ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి ఏమో మాటలు చెప్తున్నారు. మేము ఇక్కడే కూర్చుంటాము". - స్థానికురాలు

"నోటీసులు వస్తున్నాయంటే.. ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎలా వస్తాయి. అందరికీ తెలుసు. కావాలనే ఇలా చేస్తున్నారు. 50 సంవత్సరాల నుంచీ ఉంటున్నాం". - స్థానికురాలు

"పేదలు 7000 రూపాయలు అద్దెలు పెట్టి ఎక్కడకి వెళ్లగలరు. ఇలాంటి సంస్కృతిని మానుకొని.. పేద ప్రజలకు న్యాయం చేయాలి. మేము రోడ్డు మీద ఇక్కడే కూర్చుంటాము. పక్కా ఇళ్లు ఇస్తామని.. కలెక్టర్ గారు హామీ ఇచ్చేంత వరకూ ఇక్కడే ఉంటాం. న్యాయం జరిగే వరకూ మేము పోరాటం చేస్తాం". - స్థానికుడు

"చిన్న చిన్న ఇళ్లు.. వాళ్లకి 2004లో పట్టాలు ఇచ్చారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు.. అక్కడ 40 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. మొన్న ఈ మధ్యన పైప్​లైన్ రిపేరు అని చెప్పి.. రెండు ఇళ్లు పడగొట్టేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేదు". - స్థానికుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.