గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా సాగుతున్న అక్రమ మద్యం వ్యాపారం గుట్టురట్టైంది. నకరికల్లు వద్ద అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో.. సుమారు 11 లక్షలు విలువైన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 వేల 656 తెలంగాణ మద్యం సీసాలు లభ్యమైనట్లు.. తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేయగా ఎనిమిది మంది పరారైనట్లు తెలిపారు. తెలంగాణ నుంచి చిలకలూరిపేటకు తెప్పించి.. అక్కడి నుంచి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలిందని అబ్కారీ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..