పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పల్నాడు జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా పల్నాడు జిల్లా ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. గుంటూరులో నిర్వహించిన... జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే 25 జిల్లాలు ఏర్పాటుపై కీలక నిర్ణయం వెలువడనుందని చెప్పారు. నరసరావుపేటలో వైద్య కళాశాల ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లాల ఖరారు తర్వాత తెలుస్తుందన్నారు.
'పల్నాడు జిల్లాకు ప్రతిపాదన.. త్వరలోనే నిర్ణయం' - పల్నాడు జిల్లా ఏర్పాటుపై లావు శ్రీ కృష్ణ దేవరాయలు కామెంట్స్
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 25 జిల్లాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో భాగంగానే.. పల్నాడు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటించి అవకాశం ఉందన్నారు. అందుకు తగిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందించామన్నారు. నరసరావుపేటలో వైద్యకళాశాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపామని ఎంపీ స్పష్టం చేశారు.
పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పల్నాడు జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా పల్నాడు జిల్లా ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. గుంటూరులో నిర్వహించిన... జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే 25 జిల్లాలు ఏర్పాటుపై కీలక నిర్ణయం వెలువడనుందని చెప్పారు. నరసరావుపేటలో వైద్య కళాశాల ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లాల ఖరారు తర్వాత తెలుస్తుందన్నారు.
ఇదీ చదవండి : అమరావతిని అఖిలపక్షంలోనూ అడ్డుకున్నారు: తెదేపా