అతివేగంతో వ్యతిరేక దిశలో వచ్చిన ఓ లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గుంటూరు హౌసింగ్ బోర్డు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన బండ్లమూడి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి... ట్రాక్టర్ ఢీ కొని ఇద్దరు మృతి... పరారీలో డ్రైవర్