ETV Bharat / state

ప్లాస్మా థెరపీ... కరోనా బాధితులకు సంజీవని

కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్లాస్మా థెరపీ చక్కటి పరిష్కారమని నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. కొవిడ్ బాధితులను కాపాలంటే ప్లాస్మా దానం చేయాలని సూచించారు.

author img

By

Published : Jul 16, 2020, 9:39 PM IST

large-scale-of-plasma-should-be-donated-to-protect
నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి

ప్లాస్మా థెరపీ ప్రస్తుతం కొవిడ్ రోగుల పాలిట సంజీవనిలా మారుతోంది. కొంత కాలంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కొవిడ్-19 సోకి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారిని కాపాడేందుకు.. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఉపయోగపడుతుందని తెలంగాణ సర్కార్ చెప్పింది.

వారు ప్లాస్మా దానానికి అర్హులు..

ప్రస్తుతం ఆశించిన మేర ప్లాస్మా దాతలు ముందుకు రావట్లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం 18-50 ఏళ్ల వయసు గల ఆరోగ్యవంతమైన స్త్రీ, పురుషులు, యాంటిబాడీస్ టైటర్స్ 1: 640పైన ఉన్నటువంటి వారు ప్లాస్మా దానం చేయవచ్చని నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం స్పష్టం చేసింది. కరోనా వైరస్ బారిన పడి 14 రోజుల అనంతరం వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు అర్హులు అని సంఘం పేర్కొంది.

ప్లాస్మా థెరపీతో త్వరగా నయం..

హృద్రోగం, 50 శాతానికి పైగా ఊపిరితిత్తులు, మూత్రపిండ సంబంధిత, డయాబెటీస్ తదితర సుదీర్ఘ వ్యాధులతో ఉన్న రోగులు ప్లాస్మా థెరపీతో త్వరగా ఉపశమనం పొందుతారని వెల్లడించింది.

వారు పెద్ద ఎత్తున ముందుకు రావాలి..

ప్లాస్మా దానం ద్వారా వివిధ దీర్ఘకాలిక రోగాల నుంచి ఇబ్బందులకు గురవుతున్నవారు వేగంగా కోలుకోగలుగుతారని వివరించింది. కొవిడ్ వైరస్ బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలని సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ప్లాస్మా దాతల కొరత ఉందంటున్న నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చదవండి:

'ఏపీ కొవిడ్ ఆస్పత్రిలో వైద్యం బాగుంది.. కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.