తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులు గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తీవ్ర నీటి సమస్యతో పాటు ఇళ్లకు నెంబర్లు లేక రేషన్ కార్డు సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పరిష్కరించాలని అధికారులను కోరితే గ్రామ విలీనం విషయం కోర్టులో ఉన్నందున ఏమీ చేయలేమంటున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.
గత పదిహేను సంవత్సరాలుగా నివాసముంటున్నా.. తమకు ఇంటి నెంబర్లు లేవని, అంతేకాకుండా తాగునీటికి తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే తాము డబ్బులు వెచ్చించి నీళ్లు కొనుక్కోలేక పోతున్నామని తెలిపారు. అధికారులకు సమస్యను తెలిపితే కోర్టులో ఉందని చెప్పి తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న వేసవిలో తమకు తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సదుపాయం కల్పించడంతో పాటు శాశ్వత ఇంటి నెంబర్లు ఇప్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: