ETV Bharat / state

గుంటూరులో నగదు అపహరణ ఘటన.. సీసీ ఫుటేజ్ లభ్యం

గుంటూరు నగరంలో నిన్న అపహరణకు గురైన రూ. 9 లక్షలపై.. పోలీసులకు కీలక సమాచారం లభించింది. స్థానిక సీసీ కెమెరాలో ఆ దొంగతనం రికార్డు కాగా.. అందులోని వ్యక్తిని లాలాపేట పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

theft recorded in cc camera, guntur theft incident yesterday
నగదు అపహరణ ఘటనలో సీసీ ఫుటేజ్ లభ్యం, గుంటూరులో నగదు అపహరణలో కీలక ఆధారం లభ్యం
author img

By

Published : Apr 18, 2021, 10:53 PM IST

మాటువేసి దోచేస్తున్న నిందితులు

ద్విచక్రవాహనంలో ఉంచిన రూ. 9 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుంటూరు నగరంలోని లాలాపేట ఠాణాలో నిన్న ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసుల దర్యాప్తులో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ లభించింది. బాధితుడు ద్విచక్రవాహనంలో పెట్టిన నగదును ఓ వ్యక్తి అపహరించినట్లు అందులో కనిపిస్తోంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.

సంబంధిత కథనం: నదిలో చిక్కుకున్న ట్రాక్టర్​- జవాన్ల సాయంతో ఒడ్డుకు

గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన సుంకర ప్రతాప్​ రెడ్డి అనే వ్యక్తి.. స్థానిక మిర్చియార్డులో ఓ కమీషన్ వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. శుక్రవారం వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నంబజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ. 9 లక్షల నగదు డ్రా చేసి బ్యాగ్​ను తన ద్విక్రవాహనంలో భద్రపరిచాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పురుగుమందుల బజారులో టిఫిన్ చేసి దుకాణానికి వెళ్లాడు. అనంతరం వాహనంలో పెట్టిన నగదు కోసం చూడగా కనిపించలేదు. ఎవరో అపహరించారని గ్రహించిన బాధితుడు.. లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత కథనం:

బైక్​లో పెట్టిన 9 లక్షలు​ మాయం.. అసలేమైంది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.