గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల వద్ద మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటుకూరుకు చెందిన శ్రీలక్ష్మి(29), ప్రత్తిపాడు మండలం కొండెపాడుకు చెందిన బండ్ల లక్ష్మణ్‌లు ఓ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. లక్ష్మణ్ తన కుటుంబ అవసరాలకు శ్రీలక్ష్మి నుంచి రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. దీర్ఘకాలం నుంచి అప్పు తీర్చలేదు. ఈ నెల 8న మధ్యాహ్నం పుల్లడిగుంట వస్తే అప్పు తీరుస్తానని చెప్పి ఆమెను పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమె మెడకు కండువాతో బిగించి ఊపిరాడకుండా హతమర్చినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడు లక్ష్మణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ కమలాకరరావు పరిశీలించారు. మృతురాలి భర్త గోనం భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: