ETV Bharat / state

'లబ్ధిదారులకు తక్షణమే​ రుణాలు మంజూరు చేయాలి' - ఎస్సీ కార్పొరేషన్​ లబ్ధిదారుల ఎదురు చూపులు

ఎస్సీ కార్పొరేషన్​లో లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా కార్పొరేషన్​లో రుణాలు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఈ నెల 12 జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు.

kvps press meet on sc corporation loans in guntur district
లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలి
author img

By

Published : Oct 9, 2020, 7:58 PM IST

ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణాలు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందలేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి గుంటూరు జిల్లా కార్యదర్శి కృష్ణ మోహన్ అన్నారు. తక్షణమే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన రుణాల ఉసే లేదని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లబ్ధిదారులు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్​లో ఎన్ఎస్ఎఫ్​డీసీ/ఎన్ఎస్​కెఎఫ్​డీసీ పథకం క్రింద జిల్లాలో 150 మందిని అర్హులుగా ప్రకటించి వారికి రుణాలు మంజూరు చేసిందన్నారు. ఖాతాలో నగదు జమ అవుతుందనుకునే సమయంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల నిలిచిపోయాయని తెలిపారు. తమ సమస్యలని పరిష్కరించాలని పలుమార్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లామని, సంబంధిత శాఖ అధికారులను కలసిన లాభం లేకుండా పోయిందని వాపోయారు.

తక్షణమే లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని.. లేని పక్షంలో ఈ నెల 12 జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎదుట నిరసన దీక్ష చేపడతామన్నారు. అవసరమైనతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి:

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.